Covid-19: ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం తగదు: కేంద్ర ప్రభుత్వం

ప్రపంచం కోవిడ్‌-19 మహమ్మారి నాలుగోదశను చూస్తోందని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి తీవ్రత...

Published : 24 Dec 2021 23:48 IST

దిల్లీ: ప్రపంచం కొవిడ్‌-19 మహమ్మారి నాలుగో దశను చూస్తోందని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో పాజిటివిటీ రేటు 6.1శాతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం తగదని హితవుపలికారు. యూరప్‌తో పోలిస్తే ఉత్తర అమెరికా, ఆఫ్రికాల్లో ప్రతివారం కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. ఆసియాలో తాజా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అలసత్వం తగదన్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల విషయంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నట్లు ప్రకటించారు. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల గురించి మాట్లాడుతూ దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 కేసులు నమోదుకాగా అందులో 114మంది కోలుకున్నట్లు తెలిపారు. టీకాకు అర్హులైన వారిలో ఇప్పటి వరకు 89శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారని, 61 శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రాత్రి కర్ఫ్యూ విధించడం, పెద్ద ఎత్తున బహిరంగ సమావేశాలను నియంత్రించడం, ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచడం వంటివి కఠినంగా అమలు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈనెల 21న రాష్ట్రాలకు ముందస్తుగా సూచించిందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని