Updated : 28 Mar 2022 05:08 IST

Nitish Kumar: బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌పై యువకుడి దాడి.. అరెస్ట్‌!

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సీఎం సొంత ఊరైన భకిత్యాపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి యత్నించిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్‌భద్ర యాజీ అనే స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నితీశ్‌ హాజరయ్యారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్‌పైకి వచ్చిన ఓ యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఉండగా ఓ సాధారణ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని