Cinema News: మహాభారత్‌ భీముడు ఇకలేరు

ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ధారావాహిక ‘మహాభారత్‌’లో భీముడి పాత్ర పోషించిన ప్రవీణ్‌కుమార్‌ సోబ్తీ(74) ఇక లేరు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో దిల్లీలోని స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస  

Updated : 09 Feb 2022 06:58 IST

ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ధారావాహిక ‘మహాభారత్‌’లో భీముడి పాత్ర పోషించిన ప్రవీణ్‌కుమార్‌ సోబ్తీ(74) ఇక లేరు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో దిల్లీలోని స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ‘‘ప్రవీణ్‌కు ఛాతిలో నొప్పిగా ఉండటంతో డాక్టర్‌ను ఇంటికి పిలిపించాం. ఆయన వచ్చి ఆసుపత్రికి తరలించేలోపు గుండెపోటుతో కన్నుమూశారు’’అని ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.   సరిహద్దు భద్రతా దళాల్లో పనిచేసిన ప్రవీణ్‌ ఆ తర్వాత అథ్లెట్‌ బాగా రాణించారు. డిస్కస్‌ త్రో, హ్యామర్‌ లాంటి అథ్లెటిక్‌ పోటీల్లో ఆసియా క్రీడలతో పాటు, ఇతర పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు. 1966 కామన్వెల్త్‌ గేమ్స్‌లో డిస్కస్‌ త్రోలో రజత పతకం గెలుపొందారు ప్రవీణ్‌. బి.ఆర్‌.చోప్రా రూపొందించిన ‘మహాభారత్‌’ ధారావాహికతో నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టారు. ఆ తర్వాత 50కిపైగా ధారావాహికలతో పాటు పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రవీణ్‌ మృతిపట్ల సరిహద్దు భద్రతా దళంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని