Priyamani: విలన్‌గా నటించాలనుంది

‘‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పాత్రల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదు. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది’’ అంది నటి ప్రియమణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘భామా కలాపం’.

Updated : 13 Feb 2022 11:30 IST

‘‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పాత్రల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదు. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది’’ అంది నటి ప్రియమణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘భామా కలాపం’. అభిమన్య తాడిమేటి తెరకెక్కించారు. ఈ సిరీస్‌ ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది ప్రియమణి. ఆ విశేషాలివి..

‘‘నేనిందులో అనుపమ అనే గృహిణి పాత్రలో నటించా. సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమన్య కథ చెప్పినప్పుడే నాకీ స్క్రిప్ట్‌ చాలా నచ్చేసింది. ఎందుకంటే మధ్యతరగతి గృహిణిగా.. ఇలాంటి అమాయకమైన పాత్ర నేనింత వరకు చేయలేదు. అదే నాలో ఆసక్తిరేకెత్తించింది. ఇది నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర. నేను కొత్తదనం నిండిన పాత్రలు చేయాలనుకుంటున్నా. శక్తిమంతమైన విలన్‌ పాత్రలు పోషించాలనుంది’’.

‘‘ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’లో నటిస్తున్నా. హిందీలో అజయ్‌ దేవగణ్‌తో ‘మైదాన్‌’లో చేస్తున్నా. కన్నడలో ‘డాక్టర్‌ 56’ చేశా. తమిళంలో ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే సినిమా చేస్తున్నా. అలాగే ‘ఫ్యామిలీమెన్‌ 3’ వెబ్‌సిరీస్‌ చేయాల్సి ఉంది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు