Kannappa: రామోజీ ఫిల్మ్‌ సిటీలో.. కన్నప్ప సెట్లో

మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’.

Updated : 10 May 2024 09:58 IST

మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడు ప్రభాస్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడాయన ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టినట్లు మంచు విష్ణు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఆయనిందులో నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ షూట్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రలో దర్శనమివ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని