Matru: ‘మాత్రు’.. ఓ థ్రిల్లర్‌ యాక్షన్‌ చిత్రం

సుగి విజయ్‌, రూపాలి భూషణ్‌ జంటగా... జాన్‌ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’.

Updated : 10 May 2024 10:06 IST

సుగి విజయ్‌, రూపాలి భూషణ్‌ జంటగా... జాన్‌ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. బి.శివప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ (శ్రీరామ్‌) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న   ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆవిష్కరించారు. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే   చిత్రమిది. ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉంటాయి. చిత్రీకరణ, నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. రవి కాలే, పృథ్వీరాజ్‌, అలీ, దేవిప్రసాద్‌, ఆమని, నందినిరాయ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని