Prthinidhi2: ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది

‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు.

Updated : 10 May 2024 10:02 IST

‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మూర్తి దేవగుప్తపు. ఆయన దర్శకత్వంలో నారా రోహిత్‌ హీరోగా నటించిన చిత్రమే ‘ప్రతినిధి 2’. కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. సిరి లెల్ల కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మూర్తి దేవగుప్తపు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. చక్కటి పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది. ఇందులో నారా రోహిత్‌ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. తను ‘ప్రతినిధి’లోనూ అదే పాత్ర పోషించారు. అందుకే ఈ కథకు ఆయన్నే హీరోగా తీసుకున్నా. అంతేగానీ దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవు. ప్రతి జర్నలిస్ట్‌ సమాజంపై బాధ్యతతో ఉద్యోగం చేస్తాడు. దీంట్లో హీరో కూడా అదే బాధ్యతతో పని చేస్తాడు. ఆ పాత్రలో మంచి సస్పెన్స్‌ ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే నిజమైన నాయకులు తప్ప ప్రజా పాలకులుగా భావిస్తున్న వాళ్లు నాయకులు కాదని దీంట్లో అంతర్లీనంగా ఓ సందేశం ఉంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మంచి సినిమా చేశామని భావిస్తున్నాం. దీంట్లో పాత్రలన్నీ గొప్పగా ఉంటాయి. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాతలు ఆంజనేయులు, కుమార్‌ రాజా బత్తుల. ఈ కార్యక్రమంలో దినేష్‌ తేజ్‌, సిరి లెల్ల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు