saif ali khan: అంధుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌?

పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌.

Updated : 10 May 2024 10:18 IST

పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. ఇప్పుడు ఆయన మరోసారి వైవిధ్యమైన పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో సైఫ్‌ అంధుడి పాత్ర పోషించనున్నారట. ‘స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది. థ్రిల్లింగ్‌ కథనంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇది సైఫ్‌ అలీఖాన్‌కి మైలురాయిలా నిలిచిపోయే చిత్రమవుతుంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రియదర్శన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘దేవర’, హిందీలో ‘జ్వెల్‌ థీఫ్‌’, ‘క్లిక్‌ శంకర్‌’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు సైఫ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని