Kiran Abbavaram: కానిస్టేబుల్‌ ‘సెబాస్టియన్‌’ రేచీకటి కష్టాలు

కిరణ్‌ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెబాస్టియన్‌’. పిసి 524.. అన్నది ఉపశీర్షిక. ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు. నమ్రతా దారేకర్‌, కోమలి ప్రసాద్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం

Updated : 04 Feb 2022 07:10 IST

కిరణ్‌ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెబాస్టియన్‌’. పిసి 524.. అన్నది ఉపశీర్షిక. ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు. నమ్రతా దారేకర్‌, కోమలి ప్రసాద్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్‌ మాట్లాడుతూ ‘‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’ షూట్‌లో ఉన్నప్పుడు బాలాజీ నన్ను కలిశారు. ‘సెబాస్టియన్‌’ కథ.. పాత్ర ఎలా ఉంటుందన్నది క్లుప్తంగా చెప్పారు. 15నిమిషాలు కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నా. నేనిందులో రేచీకటితో బాధపడే కానిస్టేబుల్‌గా కనిపిస్తా. ‘చంటి’లో బ్రహ్మానందం గారు 15నిమిషాలు రేచీకటి పాత్ర చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్‌ చేశారు. అందుకే ఈ పాత్రను ఓ సవాల్‌లా తీసుకుని చేశా. సెబా పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఈ కథ మన పక్కింటి కుర్రాడి కథలా ఉంటుంది. సినిమా ప్రేక్షకుల్ని వందశాతం ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘సెబాస్టియన్‌ అనే కానిస్టేబుల్‌ తనకున్న రేచీకటి సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నాడు? అన్నది ఈ చిత్ర కథాంశం. మదనపల్లె రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుంది. 32రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం’’ అన్నారు దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈనెల 25న మా సెబాస్టియన్‌ ఛార్జ్‌ తీసుకోనున్నాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దారెడ్డి, విప్లవ్‌, రాజ్‌ కె.నల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని