చిరు.. పవన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రారంభమైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ హరితహారం, గ్రీన్‌ ఇండియా

Updated : 26 Jul 2020 16:04 IST

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమవంతు పాత్ర పోషించాలని చిరు, పవన్‌లు పిలుపునిచ్చారు. వీరితో పాటు, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడిలు కూడా పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని అందరికీ స్ఫూర్తినిచ్చిన చిరు.. పవన్‌లకు ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నటుడు అల్లరి నరేష్‌ కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని