‘రెబల్‌’ అంటే అర్థం అది కాదు: పూరీ

రెబల్‌.. అంటే సరైన అర్థం చెప్పే ప్రయత్నం చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఆయన గత కొన్ని రోజులుగా వివిధ అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షేర్‌ చేసే వీడియోలకు క్రేజ్‌ లభిస్తోంది. తాజాగా ఆయన ‘పూరీ మ్యూజింగ్‌’లో ‘రెబల్‌’ అంటే ఎవరో వివరించారు. ‘రెబల్‌ అనేది వ్యక్తిత్వం

Published : 22 Sep 2020 02:16 IST

హైదరాబాద్‌: ‘రెబల్‌’.. అంటే సరైన అర్థం చెప్పే ప్రయత్నం చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఆయన గత కొన్ని రోజులుగా వివిధ అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షేర్‌ చేసే వీడియోలకు క్రేజ్‌ లభిస్తోంది. తాజాగా ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌‌‌’లో ‘రెబల్‌’ అంటే ఎవరో వివరించారు. ‘రెబల్‌ అనేది వ్యక్తిత్వం. నీ మీద నీకు గౌరవం ఉండాలి. నేను అందరికంటే తోపు అనుకుని మిగిలిన వారిని చులకనగా చూడటం కాదు. గౌరవం ఇచ్చి, తీసుకునేవాడు. నీకంటే పైన ఎవడు లేడు.. కింద ఎవడు లేడు. ఓ రెబల్‌ వల్ల సమాజం మారుతుంది కానీ.. సమాజం వల్ల రెబల్‌ మారడు. ప్రతి దానికి ఎఫెక్ట్‌ అవ్వడు. పరిస్థితుల్ని మనం ఎలా చూస్తామనేది ముఖ్యం. సమాజం ప్రభావం ప్రజల గుంపుపై పడుతుంది.. కానీ రెబల్‌పై పడదు. అలాగని అతడు సమాజానికి వ్యతిరేకం కాదు. అందులోని చెత్తకు దూరంగా ఉంటాడంతే’.

‘జీవితంలో మన తెలివి తేటలన్నీ రెండే రెండింటికి పనికొస్తాయి. అవే.. నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్‌ చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వారిని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నావు. ఎవరి వల్ల చిరాకు పడకుండా.. తెలివిగా బతికేవాడే రెబల్‌. ఎవడి మాట వినొద్దు.. మనిషి మాట అసలు వినొద్దు. నీ నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నువ్వు రెబల్‌’ అని ఆయన ముగించారు. 

ప్లాస్టిక్‌ని మళ్లీ వాడుదాం..

‘ప్లాస్టిక్‌’ అంశంపై కూడా పూరీ మరో వీడియోలో మాట్లాడారు. ‘ఇవాళ ప్లాస్టిక్‌ ప్రపంచ సమస్యగా మారింది. కానీ 1960ల కాలంలో ప్లాస్టిక్‌ కనిపెట్టినప్పుడు మానవజాతి పొంగిపోయింది. కనిపెట్టిన వ్యక్తి చేతిలో అవార్డులు పెట్టి చప్పట్లు కొట్టారు. ప్రజలకు దాన్ని వాడే పద్ధతి తెలియలేదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ను తిట్టుకోవద్దు.. దాన్ని పూర్తిస్థాయిలో వాడండి. కూరగాయలు తెచ్చుకున్న కవర్‌ను రోడ్లపై పారేయొద్దు.. మళ్లీ వాడండి. ఇన్నాళ్లూ లేని వాతావరణ మార్పులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అదీ మనవల్లే. ప్లాస్టిక్‌ను రీ యూజ్‌ చేద్దాం’ అని ఆయన సూచించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని