రజనీ ఆరోగ్యంపై అపోలో తాజా బులెటిన్‌

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే........

Updated : 26 Dec 2020 01:32 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. రజనీకాంత్‌ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు శనివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు. బీపీ హెచ్చు తగ్గుల కారణంగా రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 

రజనీ త్వరగా కోలుకోవాలి: కమల్‌ హాసన్‌

‌రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ స్పందించారు. రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కమల్‌హాసన్‌ ఆకాంక్షించారు. 

 

ఇదీ చదవండి..

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌

రజనీ ఆస్పత్రిలో చేరారని తెలిసి బాధపడ్డా: పవన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని