Chiranjeevi-Ravi teja: మరోసారి ఇద్దరూ?

చిరంజీవి సినిమాలో రవితేజ నటించనున్నారా? ఆ మేరకు చర్చలు ఊపందుకున్నాయా?- ఈ ప్రశ్నలకి  అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

Published : 05 Oct 2021 06:42 IST

చిరంజీవి సినిమాలో రవితేజ నటించనున్నారా? ఆ మేరకు చర్చలు ఊపందుకున్నాయా?- ఈ ప్రశ్నలకి  అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. చిరంజీవి 154వ సినిమా అది. ఈ దసరాకే చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో చిరుతోపాటు మరో కథానాయకుడు చేయాల్సిన ఓ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం రవితేజని సంప్రదించినట్టు, చర్చలు సాగుతున్నట్టు తెలిసింది. చిరంజీవి సినిమాలో రవితేజ నటించడం కొత్తేమీ కాదు. ‘అన్నయ్య’తోపాటు ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లోనూ మెరిశారు రవితేజ. అన్నీ కుదిరితే మరోసారి ఆ ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని