Pushpaka Vimanam: నవ్వులు పంచే ‘పుష్పక విమానం’

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. 

Updated : 28 Oct 2021 09:40 IST

నంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని ఆంధ్రా, సీడెడ్‌లలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, నైజాంలో గ్లోబల్‌ సినిమాస్‌, ఓవర్సీస్‌లో ఫ్రీజ్‌ ఫ్రేమ్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేయనున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. ఈనెల 30న ట్రైలర్‌   విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, ఛాయాగ్రహణం: హెస్టిన్‌ జోస్‌ జోసెఫ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని