Devil: ఆ కారణంతోనే నవీన్‌ను దర్శకుడిగా తొలగించా: అభిషేక్‌ నామా

‘డెవిల్‌’ (Devil) వివాదంపై తాజాగా చిత్ర దర్శక- నిర్మాత అభిషేక్ నామా స్పందించారు.

Published : 28 Dec 2023 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కల్యాణ్‌ రామ్‌’ (Kalyan Ram) హీరోగా నటించిన ‘డెవిల్‌’ (Devil) చిత్రానికి దర్శకత్వం విషయంలో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు అభిషేక్‌ నామా (Abhishek Nama) స్పందించారు. నవీన్‌ మేడారంను దర్శకత్వ బాధ్యతల నుంచి తొలగించడానికి గల కారణాన్ని తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా ప్రాజెక్ట్‌ను నవీన్‌ హ్యాండిల్‌ చేయలేకపోయాడని.. అందుకే తాను దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పిరియాడికల్‌ డ్రామాగా ‘డెవిల్‌’ సిద్ధమైంది. సంయుక్త కథానాయిక. అభిషేక్‌ నామా దర్శక - నిర్మాతగా వ్యవహరించారు. డిసెంబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని తానే తెరకెక్కించానని తెలియజేస్తూ నవీన్‌ మేడారం బుధవారం ఓ పోస్ట్‌ పెట్టారు. దాదాపు 105 రోజుల పాటు శ్రమించి సినిమా షూట్‌ పూర్తి చేశాననీ.. తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు ఏమాత్రం క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్‌ ఎంతో శ్రమించారని చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. నవీన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా అభిషేక్‌ నామా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని