Hollywood: హాలీవుడ్‌లో సమ్మె సైరన్‌.. ఆగిన షూటింగ్‌

సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ పదాలు వినిపించట్లేదు.  సినీప్రియులు ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాలు, సిరీస్‌ల విడుదల ఆలస్యం కానుంది.

Updated : 15 Jul 2023 14:15 IST

సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ పదాలు వినిపించట్లేదు. సినీప్రియులు ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాలు, సిరీస్‌ల విడుదల ఆలస్యం కానుంది. 63 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా నటీనటులు, రచయితలు సమ్మె చేపడుతుండటంతో అమెరికా కాలమానం ప్రకారం గురువారం నుంచి చిత్రపరిశ్రమలో అన్నికార్యకలాపాలు నిలిచి పోయాయి. కృత్రిమ మేధ నుంచి పొంచి ఉన్న ముప్పు, అరకొర జీతాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ నిరవధిక సమ్మె జరుగుతోంది. హాలీవుడ్‌ సినీ నటులు, రచయితలు కలిసి న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌లో సమ్మెలో పాల్గొన్నారు. దశాబ్దల తర్మాత భారీ సంఖ్యలో సమ్మే జరగడం ఇదే మొదటిసారి. రెండు నెలలుగా రచయితలు పనిచేయకపోవడంతో చాలా నిర్మాణ సంస్థలు సినీ పనులను ఆపేశాయి.  స్క్రీన్‌ యాక్టర్‌ గిల్డ్‌-అమెరికన్‌ ఫెడరెషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్ట్స్‌(ఎస్‌ఏజీ-ఏఎఫ్‌టీఆర్‌ఏ) అధ్యక్షుడు, మాజీ స్టార్‌ ఆఫ్‌ ‘ది నానీ’ ఫ్రాన్‌ డ్రెఛ్సర్‌తో సహా ఎందరో నటీనటులు రచయితల పట్ల సంఘీభావాన్ని తెలిపారు. ఈ సమ్మెలో 65000 నటులు చేరారు. స్టూడియోస్‌, స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌తో ఉన్న సమస్యల వల్ల ఈ రెండు వర్గాల వారు సమ్మెను మొదలుపెట్టారు. వేతన సమస్యలతో పాటు కృతిమ మేథ తమ జీవితాలపై ప్రభావం చూపనుందంటూ ఆందోళన బాట పట్టారు. ఆస్కార్‌, ఎమ్మీ విజేతలు కూడా వీరి సమ్మెకు మద్దతుగా నిలిచారు. 1960 నుంచి వీరు ఇలా సినిమా పనులు ఆపేసి సెట్ల నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. ఎస్‌ఏజీ నాయకుడు రోనాల్డ్‌ రెగాన్‌ కూడా ఇందులో పాలు పంచుకున్నారు.

డ్రెఛ్సర్‌ మాట్లాడుతూ...‘మాకు వేరే మార్గం లేదు. మేము ఇక్కడ బాధితులం. అందుకు చాలా బాధపడుతున్నాము. ఈ వృత్తిలో ఉన్న వారు మాతో వ్యవహరిస్తున్న తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. సీఈఓలకు మిలియన్ల కొద్ది డబ్బులు ఇస్తున్నప్పుడు మా పట్ల ఇలా ఎందుకు చేస్తున్నారు. నేను నమ్మలేకపోతున్నాను’ అని అన్నారు. డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ లాంటి ఇతర సామాజిక మాధ్యమాల స్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రాతినిధ్యం వహించే ‘ది అలియాన్స్‌ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యుసర్స్‌(ఏఎంపీటీపీ) సినిమా, నిర్మాణ సంస్థను నమ్ముకున్న వేలది మంది పనివారికి మద్ధతుగా నిలిచింది. చిత్రీకరణ కంటే నటుల సమ్మెనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. సినిమా ప్రదర్శనలకు, ఎమ్మీ అవార్డుల ప్రచారానికి అనుమతి ఇవ్వడం లేదు. ‘సాటర్‌డే నైట్‌ లైవ్‌’ లాంటి లేట్‌ నైట్‌ షోలూ, నెట్‌ఫ్లిక్స్‌ లో వచ్చే ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’, మాక్స్‌ ఛానల్లో వచ్చే ‘హ్యక్స్‌’, ఫాక్స్‌లో వచ్చే ‘ఫ్యామిలీ గయ్‌’ లను ఆపివేయాలని రచయితల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సమ్మె కారణంగా హాలీవుడ్‌ భారీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు మరింత ఆలస్యంగా విడుదల కానున్నాయి. స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌లో ట్రామ్‌ క్రూజ్‌, ఏంజెలినా జోలీ, జానీ డెప్‌, మెరిల్‌ స్ట్రీప్‌, బెన్‌ స్టిల్లర్‌, కోలిన్‌ ఫారెల్‌ లాంటి స్టార్స్‌ ఉన్నారు. వారిలో కొందరు ఈ సమ్మెకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు