Alia Bhatt: ఇదే ప్రశ్న హీరోలని అడగరే!

అలియాభట్‌ బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగుతూ ఉండగానే రణ్‌బీర్‌కపూర్‌ని పెళ్లి చేసుకుంది.

Updated : 12 May 2023 13:01 IST

అలియాభట్‌ (Alia Bhatt) బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగుతూ ఉండగానే రణ్‌బీర్‌కపూర్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చాకా ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకుంటూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘‘కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో తల్లి కావాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్నకు అలియా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

‘‘ఇదే ప్రశ్న మీరు హీరోలను ఎందుకు అడగరు. ఇప్పటివరకూ పాపకు సంబంధించిన చాలా విషయాలను రణ్‌బీర్‌ను అడిగారు. కానీ ఎప్పుడూ ఈ ప్రశ్న ఆయన్ని అడగలేదు. ఇలాంటి వాటిని హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు. నేను కెరీర్‌ మొదలైన 10  సంవత్సరాలకు పిల్లల్ని కన్నాను. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. సినిమాలు, జీవితం...దేనిలోనైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైంది అనిపిప్తేనే చేస్తాను. నాకు నచ్చకుండా ఏ పనీ చేయను. నాకు నచ్చక పెద్ద సినిమాలు వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరోసారి ఇలాంటి ప్రశ్న అడగకండి’’అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని