AliaBhatt: ఆలియా-రణ్‌బీర్‌ మెహందీ జరిగిందిలా..!

బాలీవుడ్‌ జంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల వివాహం గురువారం అతి తక్కువమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. వాస్తు అపార్ట్‌మెంట్‌లోని తమ నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన...

Published : 16 Apr 2022 13:33 IST

ముంబయి‌: బాలీవుడ్‌ జంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వాస్తు అపార్ట్‌మెంట్‌లోని తమ నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను గురువారం రాత్రి ఆలియా షేర్‌ చేసింది. కాగా, తాజాగా ఈ భామ మెహందీ వేడుక ఫొటోలను పంచుకుంది. ‘‘మెహందీ ఫంక్షన్‌ ఇంత వేడుకగా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రేమాభిమానాలు, అబ్బాయి తరుఫు వారు ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు, అయాన్‌ముఖర్జీ డీజే, అన్నింటికంటే ముఖ్యంగా నాకిష్టమైన పాటలన్నింటికీ కపూర్‌ కుటుంబం డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌.. వీటన్నింటితో ఆనందభాష్పాలు వచ్చేశాయి. నా ప్రియసఖుడితో ఈ క్షణాలు నాకెంతో పదిలం. ఇలాంటి ఆనందకరమైన రోజులు మా జీవితాల్లో మరిన్ని రావాలని కోరుకుంటున్నా’’ అని ఆలియా తెలిపారు. ఇక, రణ్‌బీర్‌ అయితే తన తండ్రి రిషికపూర్‌ని ఈ వేడుకలో గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని