Allu Arjun: ‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌ ఇదేనా!

‘పుష్ప2’ (Pushpa2) తర్వాత అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.

Updated : 26 Dec 2023 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత చేయనున్న సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.

యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుందట. ఇందులో బన్నీ న్యూలుక్‌లో కనిపించనున్నారని సమాచారం. వచ్చే ఏడాదిలో ఇది ప్రారంభించాలని అట్లీ అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయనీ.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ‘పుష్ప2’ షూటింగ్‌ పూర్తి కాగానే అట్లీ ప్రాజెక్ట్‌పై బన్నీ పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

సినిమా అనేది పాఠశాల కాదు కదా..! విమర్శలపై సందీప్‌ వంగా కామెంట్స్‌

ఇటీవల ‘జవాన్‌’ హిట్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఆ చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ పోస్ట్‌కు అట్లీని, మ్యూజిక్‌ దర్శకుడు అనిరుధ్‌ను ట్యాగ్ చేసి ‘నా సినిమాకు కూడా ఇలానే మ్యూజిక్‌ అందించాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలోనే అట్లీ-అల్లు అర్జున్‌ల కాంబోలో సినిమా రానుందని. దానికి అనిరుధ్‌ స్వరాలు అందించనున్నారని పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. ఇక ‘పుష్ప2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని