Allu arjun: ‘పుష్ప2’.. ఆ తప్పు మళ్లీ చేయొద్దంటున్న అల్లు అర్జున్!
‘పుష్ప’(Pushpa) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్(Allu arjun).
హైదరాబాద్: ‘పుష్ప’(Pushpa) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్(Allu arjun). సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పలు సూచనలు చేశారట. ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’ షూట్ అనుకున్న దానికంటే ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీని వల్ల అనుకున్న స్థాయిలో ప్రచారం కూడా చేయలేకపోయారు. ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు సుకుమార్ సైతం హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం ఆ తప్పును మళ్లీ చేయొద్దని బన్నీ సూచించారట. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలని చిత్ర బృందానికి చెప్పారట. అందుకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్, ఇతర నటీనటుల డేట్స్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు తరలింపు!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM