Amitabh Bachchan: ప్రభాస్‌ ఇంటి రుచులకి బిగ్‌బీ ఫిదా

ఆతిథ్యం విషయంలో తనకి తానే సాటి అని నిరూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. తోటి నటులకి తన ఇంటి వంటకాల రుచి చూపించడం ఆయనకి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన వాళ్లంతా ‘ప్రభాస్‌ అదరహో’ అంటూ మెచ్చుకుంటుంటారు.

Updated : 22 Feb 2022 11:49 IST

తిథ్యం విషయంలో తనకి తానే సాటి అని నిరూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. తోటి నటులకి తన ఇంటి వంటకాల రుచి చూపించడం ఆయనకి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన వాళ్లంతా ‘ప్రభాస్‌ అదరహో’ అంటూ మెచ్చుకుంటుంటారు. అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా తాజాగా ఆ జాబితాలో చేరారు. ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం కోసం ఆయన హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ కోసం ప్రభాస్‌ ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయించి పంపారు. ఆ రుచుల్ని ఆస్వాదించిన బిగ్‌ బీ అమితాబ్‌ ‘అంతకుమించి...’ అంటూ ప్రభాస్‌ని ట్విటర్‌ ద్వారా ఆకాశానికెత్తారు. ‘‘బాహుబలి ప్రభాస్‌... నీ  అభిమానం కొలతలకి మించినది. నువ్వు తెచ్చిన ఇంటి భోజనం రుచి మాటలకు అందనిది. ఆ భోజనం పరిమాణాన్ని కూడా కొలవలేం. సైన్యానికి తిండి పెట్టగలవాడివి. నువ్వు పంపిన ప్రత్యేకమైన బిస్కెట్లు అద్భుతం. నీ అభినందనలు జీర్ణించుకోలేనివి’’ అంటూ ట్వీట్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. బిగ్‌బీ తరహాలోనే ఇదివరకు బాలీవుడ్‌కి చెందిన పలువురు నటులు ప్రభాస్‌ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో అమితాబ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని