Deepika Padukone: అంతకు ముందు తెలీదు.. సోషల్‌ మీడియా ద్వారానే ఆమె గురించి తెలిసింది: దీపికా

మోడ్రన్‌ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘గెహ్రీయాన్‌’ చిత్రంతో పలకరించనుంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. షకున్‌ భత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి11న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. 

Updated : 03 Feb 2022 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోడ్రన్‌ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘గెహ్రీయాన్‌’ చిత్రంతో పలకరించనుంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. షకున్‌ భత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి11న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక తన కో-స్టార్‌ అనన్యా పాండే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ మొదలవ్వక ముందు అనన్యా పాండే అంటే ఎవరో తెలియదు. ఇదేదో జోక్‌ చేద్దామని చెప్పడం లేదు. నిజంగానే చెబుతున్నా. మీ అందరికీ సోషల్‌ మీడియా ద్వారా అనన్య ఎలాగైతే తెలిసిందో నాకు అలానే తెలుసు. ఆమెతో కలిసి నటించడం ఓ చక్కటి అనుభూతి. నా వయసు 36. అనన్య వయసు 23. నా చెల్లి అనిషా కన్నా చిన్నది. తనంటే ఏంటో ప్రపంచానికి చూపించలేదో, ప్రజలు ఆమెకు ఇవ్వాల్సిన క్రెడిట్‌ ఇవ్వలేదేమో తెలీదు కానీ.. ఆమె చాలా షార్ప్‌. ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది ప్రతీదీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని ఆశిస్తున్నా.’’ అని చెప్పింది.

తన చెల్లిలానే భావిస్తుంది: అనన్య

దీపిక చెల్లి పేరు ‘అనిషా’.. నా పేరు ‘అనన్య’..  మా ఇద్దరి పేర్లకి దగ్గర పోలికలున్నాయి. అందుకే తన చెల్లిని ‘యానీ’ అని ఎలా పిలుస్తుందో నన్నూ ‘యానీ’ అనే అంటుంది. ఓ సహ నటిగా దీపిక దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. సీన్‌లో వెంటనే నిమగ్నమై నటిస్తుంది. ఇప్పటి వరకూ మీరు ఎందులోనూ చూసి ఉండని దీపికాని ‘అలిషా’ పాత్రలో చూడబోతున్నారు’’ అంటూ ఆ చిత్రవిశేషాలను పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని