#NKR21: కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా.. అప్‌డేట్స్‌ చెప్పిన డైరెక్టర్‌

ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్ (Kalayam Ram) ఓ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు ఈ సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు.

Published : 06 Jul 2023 16:38 IST

హైదరాబాద్‌: ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ స్టార్‌గా ఎదిగారు హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalayam Ram). ‘బింబిసార’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ దానిపై అప్‌డేట్‌ ఇచ్చారు. పూర్తి స్థాయి యాక్షన్‌ డ్రామాగా అది తెరకెక్కనున్నట్లు తెలిపారు.

కల్యాణ్‌ రామ్ 21వ చిత్రంగా రానున్న ఇది #NKR21గా ప్రచారమవుతోంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పూర్తి షూటింగ్‌ను ఇండియాలోనే చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఇందులోని నటీనటుల వివరాలు వెల్లడిస్తాం. అత్యంత భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించనున్నాం. ఇప్పటి వరకు కల్యాణ్‌ రామ్ ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ కథ అనుకోగానే నాకు ఆయనే గుర్తొచ్చారు. కథంతా ఆయన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను’’ అని అన్నారు. అలాగే, ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ (Devil)లో నటిస్తున్నారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది దీని ఉపశీర్షిక. సంయుక్త కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాతో నవీన్‌ మేడారం అనే దర్శకుడు పరిచయం కానున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాకు కల్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు