Nithiin: అది నా జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మూమెంట్‌: నితిన్‌

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man) ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

Published : 02 Dec 2023 18:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌  (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకుడు. డిసెంబర్‌ 8న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. చిత్రబృందం పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది.

‘‘మా సినిమా ప్రచార చిత్రాలకు వస్తోన్న స్పందన చూసి సంతోషంగా ఉన్నా. ట్రైలర్‌ విడుదలయ్యాక.. సినిమా మొత్తం ఇలాగే ఫుల్‌ ఫన్‌తో ఉంటుందా? అని అడుగుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీరు ట్రైలర్‌ ఏదైతే చూశారో దానికి పదింతలు వినోదం సినిమాలో ఉంటుంది. మాంచి బిర్యానీ తినిపిస్తా. అది అయితే గ్యారెంటీ. ఈ సినిమా విషయంలో అడుగడుగునా నాకు సపోర్ట్‌ చేసిన నితిన్‌, నిర్మాతలకు ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్పాలి’’ అని దర్శకుడు వక్కంతం వంశీ అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లో ఇది ది బెస్ట్‌ రోల్‌ అని చెప్పగలను. ఈ పాత్రను పోషించడం నాకెంతో సంతోషంగా అనిపించింది. షూటింగ్‌ను ఆద్యంతం ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చూసి కచ్చితంగా నవ్వుకుంటారు. ఇది నా ప్రామిస్‌. నాకు, నా టీమ్‌తోపాటు ప్రేక్షకులకు కూడా డిసెంబర్‌ 8 ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని తెలిపారు. 

ఇందులో ‘బాహుబలి’ రెఫరెన్స్‌గా ఒక సీన్‌ పెట్టినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. అలాంటి సీన్స్‌ ఇందులో ఇంకెన్ని ఉంటాయి?

నితిన్‌: మా సినిమా గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేను. కాకపోతే, అలాంటి సీన్స్‌ దాదాపు మూడు ఉంటాయి. ఎంతో సరదాగా ఉంటాయి.

ఈ చిత్రానికి తొలుత ‘జూనియర్‌’ అనే టైటిల్‌ అనుకున్నారు. అది కాకుండా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి

వక్కంతం వంశీ: కథ రాస్తున్న సమయంలో కాన్సెప్ట్‌కు అనుగుణంగా ‘జూనియర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టుకున్నామంతే. ఇది ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది. ఫైనల్‌గా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసుకున్నాం.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యూఎస్‌ వెళ్తున్నారని టాక్‌.. నిజమేనా?

నితిన్‌: సినిమా పరిశ్రమలో యూఎస్‌ పెద్ద మార్కెట్‌ అవుతోంది. ఇలాంటి చిత్రాలు అక్కడి వారికి బాగా నచ్చుతాయి. అందుకే యూఎస్‌ వెళ్లి ప్రమోట్‌ చేయాలనుకుంటున్నా.

ఈ సినిమా కథ రాయడానికి ప్రధాన కారణం ఏమిటి?

వక్కంతం వంశీ: ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్‌లో చిత్రాన్ని తీర్చిదిద్దడం ఎంతో కష్టమని నా భావన. ఓసారి అనుకోకుండా జూనియర్‌ ఆర్టిస్ట్‌ని హీరోగా చూపిస్తూ కథ రాస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఇప్పటివరకూ ఇలాంటి కథను ఎవరూ టచ్‌ చేయలేదు. తప్పకుండా ప్రేక్షకులు ఆస్వాదిస్తారని అనిపించింది.

ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్‌ 22న విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత దానిని డిసెంబర్‌ 8కి తీసుకువచ్చారు ఎందుకు?

సుధాకర్‌: ‘సలార్‌’ విడుదలను దృష్టిలో ఉంచుకుని మేము డేట్స్‌ సర్దుబాటు చేసుకున్నాం. మంచి కంటెంట్‌ ఉంటేనే ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాలు ఆడుతున్నాయి.

ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్‌ను పిలుస్తున్నారా?

నితిన్‌: లేదు. ఆయన రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

మీ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మూమెంట్‌ ఏమిటి? ఇప్పటివరకూ మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకుంటున్నారు?

నితిన్‌: గతంలో వరుస ఫ్లాప్‌ల తర్వాత ‘ఇష్క్‌’తో విజయాన్ని అందుకున్నా కదా. అది నాకు ఎక్స్‌ట్రార్డినరీ మూమెంట్‌. ఇక, ఈ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించడం ఎంతో కొత్తగా అనిపించింది. నా సినిమాల్లో ‘శ్రీ ఆంజనేయం’ అంటే నాకెంతో ఇష్టం. ఆ సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద అది మంచిగానే ఆడింది.  ఆ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే తప్పకుండా ఘన విజయం అందుతుందని నమ్ముతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని