family man: పంచ కల్యాణి తెచ్చా తెచ్చా!

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 13 Mar 2024 10:08 IST

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా మంగళవారం ఈ సినిమాలోని రెండో గీతాన్ని విడుదల చేశారు. ఇది విజయ్‌ - మృణాల్‌ల పెళ్లి వేడుక నేపథ్యంలో వచ్చే పాట. ‘‘కల్యాణి వచ్చా వచ్చా.. పంచ కల్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారి సిద్ధంగుంచా’’ అంటూ హుషారుగా సాగిన ఈ గీతానికి గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. మంగ్లీ, కార్తీక్‌ సంయుక్తంగా ఆలపించారు. యాక్షన్‌ ప్రాధాన్యమున్న కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనికి కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: కె.యు.మోహనన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు