Cinema News: ‘లంబసింగి’ ప్రేమకథ

దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆయన సమర్పణలో ‘లంబసింగి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎ ప్యూర్‌ లవ్‌స్టోరి’ అనేది ఉపశీర్షిక. భరత్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దివి కథానాయిక.

Updated : 15 Apr 2022 11:07 IST

దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆయన సమర్పణలో ‘లంబసింగి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎ ప్యూర్‌ లవ్‌స్టోరి’ అనేది ఉపశీర్షిక. భరత్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దివి కథానాయిక. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై జీకే మోహన్‌ నిర్మిస్తున్నారు. ‘‘ఈ నెల 16న ‘నచ్చేసిందే నచ్చేసిందే...’ అంటూ సాగే పాటని విడుదల చేస్తున్నాం. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ఆర్‌.ఆర్‌.ధృవన్‌ సంగీతం సమకూర్చార’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని