Prince: నీకు నాకు సెట్టయ్యింది...!

శివ కార్తికేయన్‌, మరియా ర్యాబోషప్క జంటగా కె.వి. అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ప్రిన్స్‌’. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా

Updated : 07 Dec 2022 21:07 IST

శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan), మరియా ర్యాబోషప్క (Maria) జంటగా కె.వి. అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తొలి పాట విడుదల చేశారు. ‘‘బింబిలిక్కి పిలాపి.. నీకు నాకు సెట్టయ్యింది సో హ్యాపీ’’ అంటూ సాగుతున్న ఈ గీతానికి తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. రామ్‌ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి సంయుక్తంగా ఆలపించారు. ‘‘పుదుచ్చేరి, లండన్‌ నేపథ్యాల్లో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని