Ramarao On Duty: సొట్టల బుగ్గల్లో...

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా

Updated : 08 May 2022 10:25 IST

వితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా...’ అంటూ సాగే పాటని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. సామ్‌ సీఎస్‌    స్వరకల్పనలోని ఈ గీతానికి కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. ‘‘అందమైన మెలోడీ ట్యూన్‌ ఇది. రవితేజ, దివ్యాంశ జోడీ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. నాజర్‌, నరేష్‌, పవిత్ర లోకేష్‌ తదితరులు  నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని