మాస్‌+క్లాస్‌ = సింగర్‌ విజయ్‌

మ్యూజిక్‌ మీద ఉన్న ఆసక్తితో పలువురు తారలు వివిధ సందర్భాల్లో గొంతు సవరించుకున్నారు. సంగీతంలో పూర్తి ప్రావీణ్యం లేనప్పటికీ సినిమాల కోసం గాయనీ, గాయకులుగా మారి తమ సినిమాల్లోనే కాకుండా...

Updated : 22 Jun 2020 15:27 IST

ఒకటి కాదు రెండు కాదు మొత్తం 34

చెన్నై: మ్యూజిక్‌ మీద ఉన్న ఆసక్తితో పలువురు తారలు వివిధ సందర్భాల్లో గొంతు సవరించుకున్నారు. సంగీతంలో పూర్తి ప్రావీణ్యం లేనప్పటికీ సినిమాల కోసం గాయనీ, గాయకులుగా మారి తమ సినిమాల్లోనే కాకుండా వేరే హీరోల చిత్రాల్లోనూ పాటలు పాడారు. తాజాగా అగ్రకథానాయకుడు విజయ్‌ తాను నటించిన ‘మాస్టర్‌’ చిత్రం కోసం ‘కుట్టిస్టోరీ’ పాట పాడిన విషయం తెలిసిందే. అనిరుధ్‌ స్వరాలు అందించిన ఈపాట విదేశాల్లో సైతం మార్మోగుతోంది. సోమవారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గాయకుడిగా మెప్పించిన పలు పాటలపై ఓ లుక్కేయండి.

విజయ్‌ 1994లో మొదటిసారి గొంతు సవరించుకున్నారు. తాను కథానాయకుడిగా నటించిన ‘రాశిగన్‌’ చిత్రంలో ‘బొంబాయి సిటీ’ అనే మాస్‌ పాటను అలపించారు.


1995-2002 మధ్య కాలంలో ఆయన మొత్తం 23 పాటలు అలపించారు.


సూర్య కథానాయకుడిగా నటించిన ‘పెరియన్న’ చిత్రం కోసం విజయ్‌ మూడు పాటలు పాడారు. ఇందులో ‘నాన్‌ దమ్‌ అదికిరా స్టైల్‌’ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది.


గాయకుడిగా విజయ్‌ పలువురు ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. అలా ఆయన ఇళయరాజా, దేవా, యువన్‌ శంకర్‌ రాజా, రమణ్‌ గోగుల, ఏఆర్‌ రెహమాన్‌ సారథ్యంలో సింగర్‌గా మెరిశారు.


ఇళయరాజా స్వరాలు అందించిన ‘కాదలుక్కు మరియాదై’ చిత్రంలో ‘ఓ బేబీ’ ప్రేమ పాటతోపాటు పలు చిత్రాల్లో విరహ గీతాలను కూడా ఆయన అలపించారు.


విజయ్‌ హీరోగా 2001లో తెరకెక్కిన చిత్రం ‘బద్రి’. రమణగోగుల సంగీతం అందించిన ఈ సినిమాలో ‘ఎన్నోడా లైలా’ పాటతో విజయ్‌ అభిమానులతో డ్యాన్స్‌ చేయించారు. తెలుగులో ‘తమ్ముడు’ చిత్రంలోని ‘ఓ పిల్లా నీ పేరు లవ్లీ’ సాంగే ఇది.


2012లో విడుదలైన ‘తుపాకి’ చిత్రంలో ‘గూగుల్‌ గూగుల్‌’ పాటకు గాను ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఆ ఏడాది సైమా అవార్డులకు ఆయన నామినేట్‌ అయ్యారు.


ఇప్పటివరకూ విజయ్‌ మొత్తం 34 పాటలు పాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని