
Pushpa: ‘పుష్ప’ వికాసం
సందడి విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూ ఓ కొత్త లుక్ సామాజిక మాధ్యమాల్లో విడుదలవుతోంది. శుక్రవారం కొత్త ప్రచార చిత్రంతో ఊరించారు. ముందస్తు ట్రైలర్‌గా ఇది విడుదలైంది. అందులో కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని రోజులుగా తెరకెక్కిస్తున్న ప్రత్యేక గీతం శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 6న ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. సమంత ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించారు. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు.