Cinema News: ‘రుద్రవీణ’ ప్రారంభం

శ్రీరామ్‌ నిమ్మల, ఎల్సా ఘోష్‌, శుభ శ్రీ, సోనియా సత్య నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. జి.మధు సూదన్‌రెడ్డి దర్శకత్వం....

Updated : 26 Jan 2022 07:13 IST

శ్రీరామ్‌ నిమ్మల, ఎల్సా ఘోష్‌, శుభ శ్రీ, సోనియా సత్య నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. జి.మధు సూదన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాగుల లక్ష్మణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ‘‘కొత్త రకమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రతిభావంతులైన నవతరం నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యానాంలో రెగ్యులర్‌ చిత్రీకరణని జరుపుతున్నామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. చమ్మక్‌చంద్ర, చలాకీ చంటి, ధన్‌రాజ్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.ఎల్‌.ఎన్‌.బాబు, సంగీతం: మహావీర్‌ యెలేందర్‌, కళ: భూపతి యాదగిరి, కూర్పు: జి.నాగేశ్వర్‌రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని