లుక్కు ఇచ్చె కొత్త కిక్కు
వేషం మారిందంటే చాలు... లుక్కు మారాల్సిందే. ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం కథలతోనే కాదు... తాము కనిపించే తీరులోనూ చూపించాల్సిందే అని నమ్ముతుంటారు తారలు. అందుకే కొన్నిసార్లు పాత్రలు డిమాండ్ చేసినా చేయకపోయినా... దర్శకులు అడిగినా అడకపోయినా కొత్తగా కనిపించడంపై దృష్టిపెట్టే నాయకానాయికలు చాలామందే. ఇక పాత్రే డిమాండ్ చేసిందంటే కొత్త అవతారం ఖాయం అంతే.
వేషం మారిందంటే చాలు... లుక్కు మారాల్సిందే. ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం కథలతోనే కాదు... తాము కనిపించే తీరులోనూ చూపించాల్సిందే అని నమ్ముతుంటారు తారలు. అందుకే కొన్నిసార్లు పాత్రలు డిమాండ్ చేసినా చేయకపోయినా... దర్శకులు అడిగినా అడకపోయినా కొత్తగా కనిపించడంపై దృష్టిపెట్టే నాయకానాయికలు చాలామందే. ఇక పాత్రే డిమాండ్ చేసిందంటే కొత్త అవతారం ఖాయం అంతే.
ఒకొక్క కథది ఒక్కో ప్రపంచం. ఆ ప్రపంచానికి తగ్గట్టుగానే తెరపైన పాత్రలు కనిపించాల్సి ఉంటుంది. కథనంతా తన చుట్టూనే తిప్పుకునే కథానాయకుడైతే మరీ ముఖ్యం. పాత్రలకి తగ్గట్టుగా శారీరకంగా సన్నద్ధం కావడం ఒకెత్తయితే... లుక్ పరంగా మారడం మరో ఎత్తు. కొన్నిసార్లు తెరపైన కండల దేహంతో కనిపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బరువు తగ్గి కనిపించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కథానాయకులు నెలలపాటు కసరత్తులు చేసి... ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించి సిద్ధమవుతుంటారు. కొన్ని పాత్రలేమో శారీరకంగా కాకుండా.. కేవలం తలకట్టు, గడ్డం మీసం వరసలో మార్పుని కోరుతుంటాయి. అలాంటప్పుడు ఛలో ముంబై స్టైలిస్ట్ అంటూ ఫ్లైటెక్కిస్తుంటారు మన హీరోలు. అక్కడే చేయి తిరిగిన హెయిర్‌స్టైలిస్ట్‌ల దగ్గర కోరుకున్న విధంగా లుక్ మార్చుకుని వచ్చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు తమ తమ కథలకి తగ్గట్టుగా లుక్ మార్చుకునే పనిలో ఉన్నారు. కొంతమంది కొత్త లుక్కులతో ఇప్పటికే కెమెరా ముందుకెళ్లారు.
* యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ ఎయిర్‌ఫోర్స్ యాక్షన్ డ్రామా కథలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్‌తేజ్ పైలట్‌గా నటిస్తున్నారు. పైలట్ పాత్ర అంటే అందుకు తగ్గట్టుగా ప్రత్యేకమైన లుక్‌తో కనిపించాల్సి ఉంటుంది. అందుకే ఇటీవలే ఆయన ముంబైకి వెళ్లి ఆ పాత్రకి తగ్గట్టుగా లుక్ మార్చుకుని వచ్చేశారు. నాగార్జున తదుపరి పీరియాడిక్ కథలో నటించనున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా కోసం నాగార్జున జుట్టు, గడ్డం పెంచుతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ తన పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ కోసం లుక్ మార్చారు. ఇటీవల విడుదలైన పోస్టర్లని గమనిస్తే ఇదివరకటి సినిమాలకి భిన్నంగా కనిపిస్తున్నారు. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తన 108 సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారిపోయారు. తెల్లటి గడ్డంతో ఆయన సందడి చేయనున్నారు. మరో కథానాయకుడు నాని ఇటీవలే విడుదలైన తన ‘దసరా’లో ఒకలా కనిపిస్తే, తదుపరి శౌర్య అనే కొత్త దర్శకుడితో చేయనున్న సినిమాలో మరోలా కనిపించబోతున్నారు. ‘దసరా’లో లుక్ కంటే మరింత పొడవాటి జుట్టుతో, గడ్డం లేకుండా కనిపించనున్నారు. ఇప్పటికే ఆ పాత్రకి తగ్గట్టుగా తన లుక్‌ని మార్చుకున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కోసం ఆయన గెటప్‌లో కొంచెం మార్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ తాను చేసే ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్ ఉండేలా ముందు నుంచీ జాగ్రత్త పడుతున్నారు.
* పాత్రలు డిమాండ్ చేశాయంటే ఏం చేయడానికైనా సై అనే కథానాయకులు చాలామందే. యువతరం ఆ విషయంలో మరింత ఉత్సాహం ప్రదర్శిస్తోంది. అఖిల్ అక్కినేని తన ‘ఏజెంట్’ కోసం కండలతోపాటు తన లుక్‌ని కూడా మార్చారు. విజయ్ దేవరకొండ ‘లైగర్’ కోసం అప్పట్లో పూర్తిస్థాయిలో మేకోవర్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులకు ఇంకొంచెం కొత్తగా కనిపించాలనే ప్రయత్నంలో భాగమే ఇదంతా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్