నవ్విస్తామని హామీ ఇస్తున్నాం!
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్.. అన్నది ఉపశీర్షిక. రజిత్ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్.. అన్నది ఉపశీర్షిక. రజిత్ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దీనికి ఎ.కోదండ రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు నటన అనేది ఒక కల. ‘ఏటీఎం’తో నటనకు తొలి అడుగు పడింది. ఇప్పుడీ సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. డైమండ్ రత్నబాబు ఈ కథను చాలా వినోదాత్మకంగా రాశారు. కుటుంబంతో చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పోస్టర్ చూసి అందరూ ఈవీవీ గారి సినిమా లాంటి అనుభూతి కలుగుతుందని చెప్పడం ఆనందాన్నిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ పడినా ఒక సీట్ ఈవీవీ కోసం ఉంచుతాం. అది ఆయనకు మేమిచ్చే ఓ చిరు కానుక. ఈ చిత్రంతో అందరినీ నవ్విస్తామని హామీ ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఈ కార్యక్రమంలో రజిత్‌రావు, సప్తగిరి, భీమ్స్ సిసిరోలియో తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన విచారణ
-
TCS: భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు