Salaar:జపాన్‌లోనూ ‘సలార్‌’ సందడి

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకిపైగా వసూళ్లని సొంతం చేసుకుంది. బాక్సాఫీసు దగ్గర ఇప్పటికీ సందడి చేస్తోంది.

Updated : 08 Jan 2024 09:15 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకిపైగా వసూళ్లని సొంతం చేసుకుంది. బాక్సాఫీసు దగ్గర ఇప్పటికీ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ చిత్రాన్ని ఈ వేసవిలో జపాన్‌లో విడుదల చేయనున్నట్టు ఆదివారం సినీవర్గాలు ప్రకటించాయి. జపాన్‌ ప్రముఖ పంపిణీ సంస్థ ట్విన్‌ అక్కడ ఈ సినిమాను విడుదల చేయనుంది. ‘బాహుబలి’ నుంచి జపాన్‌ ప్రేక్షకులు ప్రభాస్‌ సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్‌’ జపాన్‌తోపాటు మార్చి 7న లాటిన్‌ అమెరికాలో స్పానిష్‌ భాషలో విడుదల కానుందని సినీవర్గాలు ప్రకటించాయి. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్‌ నిర్మించింది. రెండో భాగం పనుల్ని త్వరలోనే మొదలు పెట్టనున్నట్టు ఇటీవలే ప్రభాస్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని