Kangana Ranaut: చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్.
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. సినీరంగంలో సరైన విజయాల్ని అందుకోకపోవడం వల్లే పాలిటిక్స్‌లోకి వెళ్లారంటూ వస్తోన్న వార్తలపై స్పందించింది కంగన. ‘ఈ ప్రపంచంలో కేవలం విజయాన్ని మాత్రమే అందుకున్న నటులు లేరు. అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్‌కు ‘పఠాన్’కు ముందు దాదాపు 10 సంవత్సరాలు వరకూ హిట్లు లేవు. . సినీరంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో నేను కూడా పరాజయాలతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. తరవాత ‘క్వీన్’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘మణికర్ణిక’ ముందు నాలుగేళ్లు నేను ఎలాంటి హిట్ సినిమాలు తీయలేదు. ఇటీవల నేను నటించిన ‘తేజస్’ ఫ్లాప్ అయ్యింది. త్వరలో ‘ఎమర్జెన్సీ’ రాబోతుంది. దీంతో పాటు ఓటీటీలు కూడా నటీనటులకు మంచి అవకాశాల్ని ఇస్తున్నాయి. కానీ.. ఓటీటీ నటీనటులను స్టార్స్‌గా తీర్చిదిద్దలేదు. నాకు తెలిసి మేమే చివరి తరం స్టార్స్ అని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది కంగన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్‌తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్‌తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్‌రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?