Raju yadav: మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్‌

‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్‌’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా.

Updated : 06 May 2024 09:57 IST

‘‘వ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్‌’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం హైదరాబాద్‌లో ‘రాజు యాదవ్‌’ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జబర్దస్త్‌ ఫేం గెటప్‌ శ్రీను కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మాతలు. ఈ నెల 17న విడుదల కానుంది. ట్రైలర్‌ ఆవిష్కరణ అనంతరం తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘గెటప్‌ శ్రీను విలక్షణమైన నటుడు. ‘రాజు యాదవ్‌’లో నవ్వుతూనే కనిపించే ఓ పాత్రని పోషించారు. కామెడీ చేస్తూనే భావోద్వేగాల్ని పంచే ప్రయత్నం చేశాడు. పాటలు బాగున్నాయి. సినిమా తప్పక ఆదరణ పొందుతుంద’’న్నారు. గెటప్‌ శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంలో తేజ ఎంతగానో ప్రోత్సహించారు. దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి ఫలితం దొరుకుతుంది’’ అన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాని నిర్మించామన్నారు నిర్మాత. ‘సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. భావోద్వేగాలు, వినోదం ఆకట్టుకుంటాయ’ని అన్నారు దర్శకుడు.

పవన్‌కి భారీ మెజారిటీ: పవన్‌కల్యాణ్‌పై అభిమానం చాటుకునే అవకాశం రావడంతోనే మేం ఎన్నికల ప్రచారానికి వెళ్లామన్నారు గెటప్‌ శ్రీను. పిఠాపురంలో ప్రజలు పవన్‌పై చూపిస్తున్న ప్రేమని చూశాక భారీ మెజారిటీ ఖాయమనే అభిప్రాయం కలిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని