Raju yadav: మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా.
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం హైదరాబాద్‌లో ‘రాజు యాదవ్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జబర్దస్త్ ఫేం గెటప్ శ్రీను కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అంకిత కారాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. ఈ నెల 17న విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘గెటప్ శ్రీను విలక్షణమైన నటుడు. ‘రాజు యాదవ్’లో నవ్వుతూనే కనిపించే ఓ పాత్రని పోషించారు. కామెడీ చేస్తూనే భావోద్వేగాల్ని పంచే ప్రయత్నం చేశాడు. పాటలు బాగున్నాయి. సినిమా తప్పక ఆదరణ పొందుతుంద’’న్నారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంలో తేజ ఎంతగానో ప్రోత్సహించారు. దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి ఫలితం దొరుకుతుంది’’ అన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాని నిర్మించామన్నారు నిర్మాత. ‘సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. భావోద్వేగాలు, వినోదం ఆకట్టుకుంటాయ’ని అన్నారు దర్శకుడు.
పవన్‌కి భారీ మెజారిటీ: పవన్‌కల్యాణ్‌పై అభిమానం చాటుకునే అవకాశం రావడంతోనే మేం ఎన్నికల ప్రచారానికి వెళ్లామన్నారు గెటప్ శ్రీను. పిఠాపురంలో ప్రజలు పవన్‌పై చూపిస్తున్న ప్రేమని చూశాక భారీ మెజారిటీ ఖాయమనే అభిప్రాయం కలిగిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు