Sonusood: ఇకపై ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలు

చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా అందిస్తున్నట్లు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు.

Published : 29 Sep 2021 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా అందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. ‘‘ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. శబ్దం, వాసన, రుచిని చక్కగా ఆస్వాదిద్దాం’’ అని పేర్కొన్నారు. మరి ఈ సేవలు పొందాలంటే..

తొలుత soodcharityfoundation.orgలోకి లాగిన్ అవ్వాలి ఆ తరువాత మీ పూర్తి పేరు, వయసు, జెండర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, నగరం, రాష్ట్రం తదితర వివరాలు పేర్కొనాలి. ఏ చికిత్స కావాలో పేర్కొంటూ అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకోవాలి. ఇందుకు సంబంధించి మీకున్న మెడికల్‌ ప్రాబ్లమ్‌ని కూడా క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. వైద్యానికి అవరసమైన డాక్యుమెంట్స్‌.. మరికొన్ని ముఖ్యమైన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూ.. తరువాత తన టీమ్‌తో కలిసి ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ నెలకొల్పిన సంగతి తెలిసిందే. విద్య, వైద్యానికి సంబంధించిన అవసరాలను ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు తనవంతు సాయమందిస్తూ దేశ ప్రజల హృదయాల్లో రియల్‌ హీరోగా నిలిచారు. అంతేకాకుండా ఐఏఎస్‌ కొచింగ్‌, సీఏ, లా అభ్యసించే విద్యార్థులకూ ఆసరాగా నిలుస్తూ సహకారం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని