Kiara Advani: ‘వార్‌...’కు కియారా?

చిత్రపరిశ్రమలో ఇటీవలి కాలంలో కొందరు నాయికలు యాక్షన్‌ బాట పడుతున్నారు. వరుస సినిమాలతో జోరు మీదున్న నాయిక కియారా అడ్వాణీ కూడా ఈ దారిలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Updated : 18 Jun 2023 14:06 IST

చిత్రపరిశ్రమలో ఇటీవలి కాలంలో కొందరు నాయికలు యాక్షన్‌ బాట పడుతున్నారు. వరుస సినిమాలతో జోరు మీదున్న నాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) కూడా ఈ దారిలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ‘వార్‌ 2’ (WAR 2)లో నాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మల్టీస్టార్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కియారా.. హృతిక్‌ సరసన నటించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జోడీగా ఎవరు నటిస్తారో చూడాలి మరి. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ‘సత్య ప్రేమ్‌ కీ కథా’ చిత్రంలో నటిస్తుంది కియార.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని