అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీనియర్‌ నటి జయప్రదకు ఎన్టీఆర్‌ చలన చిత్ర శతాబ్ది పురస్కారం అందించనున్నారు.

Published : 24 Nov 2022 19:54 IST

హైదరాబాద్‌: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీనియర్‌ నటి జయప్రదకు ఎన్టీఆర్‌ చలన చిత్ర శతాబ్ది పురస్కారం అందించనున్నారు. నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ సభలో సినీ నటి జయప్రదకు పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి అతిథులుగా విచ్చేయనున్నారు. వీరితో పాటు, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, డాక్టర్ మైథిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని