Mammootty: మమ్ముట్టి సినిమా రెండు దేశాల్లో బ్యాన్.. కారణమిదే!
మమ్ముట్టి తాజా చిత్రం ‘కాథల్-ది కోర్’ (Kaathal - The Core). ఈ చిత్రంపై రెండు దేశాలు నిషేధం విధించాయి.
ఇంటర్నెట్ డెస్క్: మమ్ముట్టి- జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాథల్-ది కోర్’ (Kaathal - The Core). ఈ మలయాళ చిత్రంపై రెండు దేశాలు నిషేధం విధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో.. ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలోనూ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రిక దీని కథా నేపథ్యాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన జార్జ్ (మమ్ముట్టి) తన భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. అతడు పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్ వేస్తాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఓమన అతడి నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోన్న ఓ స్నేహితుడితో జార్జ్ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జార్జ్ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని.. కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు చెబుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది..?జార్జ్ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి విడాకులు వచ్చాయా? అనేది మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ఇందులో చూపించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇది బయటకు రాగానే కువైట్, ఖతర్ దేశాలు ఈ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడానికి వీల్లేదని పేర్కొన్నాయి. మరికొన్ని అరబ్ దేశాలు ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం.
ఆయనకు నా ప్రాణం తప్ప ఏమివ్వగలను!: చిరుపై వైష్ణవ్ తేజ్ కామెంట్స్
‘కాథల్-ది కోర్’ చిత్రం కోసం మమ్ముట్టి- జ్యోతిక మొదటిసారి కలిసి నటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. తాజాగా దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా, గౌరవంగా ఉంది’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Upcoming movies telugu: డిసెంబరు ఫస్ట్ వీక్.. అటు థియేటర్, ఇటు ఓటీటీ వేరే లెవల్!
Upcoming telugu movies: 2023 చివరికి వచ్చేసింది. ఈ క్రమంలో డిసెంబరు మొదటి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించేందుకు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. మరి ఏయే సినిమాలు వస్తున్నాయో చూసేయండి. -
Rajamouli Mahesh Babu: ఒకే వేదికపై సందడి చేయనున్న రాజమౌళి- మహేశ్.. ఎక్కడంటే?
రాజమౌళి, మహేశ్ బాబు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఏ ఈవెంట్లో అంటే? -
Hi Nanna: ఆ సినిమాతో ‘హాయ్ నాన్న’కు సంబంధం లేదు: నాని
తన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు హీరో నాని. కేరళలోని కొచ్చిలో ఆదివారం సందడి చేశారు. -
Animal: సందీప్ రెడ్డి ఒరిజినల్ డైరెక్టర్.. ఆ సీక్వెన్స్ ఆలోచన వారిదే: రణ్‌బీర్ కపూర్
చెన్నైలో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘యానిమల్’ చిత్ర బృందం పాల్గొంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక తదితరులు సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
Hi Nanna: రానున్న డిసెంబర్ ఫాదర్స్ మంత్.. ఎందుకంటే: నాని
నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని చెన్నైలో విలేకర్లతో ముచ్చటించారు. -
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్
సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
Rajasekhar: రాజశేఖర్ పాత్ర.. ఊహించని విధంగా ఉంటుంది: దర్శకుడు వక్కంతం వంశీ
నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీమ్యాన్’. ఈ సినిమాలో రాజశేఖర్ ఓ పాత్ర పోషించారు. దాని గురించి నితిన్, వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Nani: సినిమా నాకు ఆక్సిజన్‌లాంటిది.. ఫలితాలు పట్టించుకోను: నాని
హీరో నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేదికపై నాని మాట్లాడారు. -
Vijay Sethupathi: హీరోగా విజయ్ సేతుపతి తనయుడు.. ఆసక్తికర టైటిల్‌తో...
పలు చిత్రాల్లో బాల నటుడిగా కనిపించిన విజయ్ సేతుపతి తనయుడు ఇప్పుడు హీరోగా మారాడు. ఈ సినిమా సంగతులివీ.. -
Prabhas: ‘యానిమల్’ ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. సోషల్ మీడియాలో పోస్ట్
రణ్‌బీర్ కపూర్-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. -
Adivi sesh: అడివి శేష్‌పై ఫిర్యాదు చేస్తానంటూ నెటిజన్ ట్వీట్.. కారణం ఏమిటంటే..?
నటుడు అడివిశేష్ (Adivi Sesh)పై ఫిర్యాదు చేస్తానంటూ తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. నెటిజన్ అలా ట్వీట్ చేయడానికి కారణం ఏమిటంటే..? -
Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’ రిలీజ్‌కు తప్పని ఇబ్బందులు.. ట్వీట్ చేసిన దర్శకుడు
‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) చిత్రం రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు గౌతమ్ మేనన్ తాజాగా ట్వీట్ చేశారు. -
Dhruva Natchathiram: మళ్లీ చిక్కుల్లో విక్రమ్ ‘ధృవ నక్షత్రం’.. విడుదలకు హైకోర్టు నిబంధన
విక్రమ్ హీరోగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ సినిమా మరోసారి సమస్యలో పడింది. -
Animal: ‘యానిమల్’, ‘స్పిరిట్’ యూనివర్స్‌పై స్పందించిన సందీప్ రెడ్డి.. ఏమన్నారంటే?
తన తాజా చిత్రాలు యానిమల్, స్పిరిట్ యూనివర్స్‌లో భాగంగా ఉంటాయా? అనే ప్రశ్న ఎదురవగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. -
Bhamakalapam2: రూటు మార్చిన ప్రియమణి.. ఈసారి థియేటర్లోకి..!
Bhamakalapam2: ఓటీటీ విడుదలై మంచి విజయం అందుకున్న ప్రియమణి ‘భామాకలాపం’కు కొనసాగింపుగా ‘భామాకలాపం’ థియేటర్లో విడుదల కానుంది. -
Kannappa: మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు పుట్టినరోజు సందర్భంగా దీని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. -
Naga Vamsi: ‘గుంటూరు కారం’.. ఆ విషయంలో అభ్యంతరం లేదు: నిర్మాత నాగవంశీ
నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. -
Animal: ‘యానిమల్’ రన్ టైమ్ ఇదే..! ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద సినిమా!
‘యానిమల్’ (Animal) సినిమా రన్‌టైమ్‌ను దర్శకుడు సందీప్ వంగా వెల్లడించారు. అంతేకాదు, సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. -
Naga Chaitanya: మత్స్యకారుడిగా నాగచైతన్య.. ఫస్ట్‌లుక్ అదిరింది.. టైటిల్ ఏంటంటే?
నాగ చైతన్య 23వ సినిమా టైటిల్ ఖరారైంది. ఈ మేరకు విడుదలైన ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. -
Vishwak Sen: ‘మహాసముద్రం’లో అందుకే నటించలేకపోయా: విశ్వక్సేన్
తానెందుకు ‘మహాసముద్రం’ సినిమాలో నటించలేకపోయారో హీరో విశ్వక్సేన్ తెలిపారు. ‘మంగళవారం’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
Rana Naidu: పెద్దోళ్లు అలా అన్నారు.. కుర్రాళ్లు సీక్వెల్ అడుగుతున్నారు: వెంకటేశ్
తన కొత్త సినిమా ‘సైంధవ్’ ప్రచారంలో భాగంగా ఓ కాలేజ్‌కు వెళ్లిన వెంకటేశ్ ‘రానా నాయుడు 2’పై స్పందించారు. ఆ వెబ్‌సిరీస్ గురించి ఆయన ఏమన్నారంటే?


తాజా వార్తలు (Latest News)
-
USA: టీనేజర్ల వ్యక్తిగత సమాచార సేకరణ ఆరోపణలు.. మెటాపై 33 రాష్ట్రాలు దావా
-
Wedding: రన్‌వేపై బారాత్.. విమానంలో వివాహం.. ‘అంబరాన్ని’ అంటిన వేడుక
-
IPL 2024: ముంబయి ఫ్రాంచైజీకి రావడంపై పాండ్య పోస్టు... గిల్‌కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ
-
Wedding: రూ.490 కోట్ల పెళ్లివేడుక.. వైరల్‌గా దృశ్యాలు..!
-
IPL 2024: అలా చేస్తేనే.. ధోనీ వచ్చే సీజన్ మొత్తం ఆడగలడు: అనిల్ కుంబ్లే
-
సాయుధ తిరుగుబాటు అంచున సియర్రా లియోన్.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..!