Vaishnav Tej: ఆయనకు నా ప్రాణం తప్ప ఏమివ్వగలను!: చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌

తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో హీరో వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) వివరించారు. ‘ఆదికేశవ’ ప్రమోషన్‌లో చిరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 Nov 2023 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ‘ఉప్పెన’తో ఆకట్టుకున్నారు యంగ్‌ హీరో  వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej). ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా వైష్ణవ్‌ తేజ్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి (Chiranjeevi) అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు.

చిరు అని ఇంగ్లిషు అక్షరాలు వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్న ఓ ఫొటోపై వైష్ణవ్‌ తేజ్‌ స్పందించారు. ‘‘పెద్ద మామయ్య (చిరంజీవి) పుట్టినరోజుకు అందరూ బహుమతులు తెచ్చారు. సాయి ధరమ్‌ తేజ్ పెద్ద కత్తిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే.. ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలను అని అనిపించింది. దీంతో సర్‌ప్రైజ్‌ చేద్దామని.. చిరు అని వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్నా. ఇక మా ఇళ్లలో ఏ వేడుక జరిగినా రామ్‌ చరణ్‌ అందరినీ ఆకట్టుకుంటాడు. ఎంతో హుందాగా ఉంటాడు. మా అన్నయ్య సాయిధరమ్‌ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్‌ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకం. దాన్ని మేమంతా ఎప్పుడో మర్చిపోయాం’’ అని చెప్పారు. అలాగే తాను విలన్‌గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు వైష్ణవ్‌ తేజ్ వెల్లడించారు.

‘పుష్ప 2’లో హైలెట్‌ అదే.. అంచనాలు పెంచేలా దేవిశ్రీ ప్రసాద్‌ కామెంట్స్‌

ఇక ‘ఆదికేశవ’ విషయానికొస్తే.. ఇందులో శ్రీలీల కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేయగా.. అందులోని డైలాగులు ఆకట్టకుంటున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చిందని, సినిమా కచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని వైష్ణవ్‌ తేజ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని