Maaya One Teaser: ‘ప్రాజెక్ట్‌-జెడ్‌’కు సీక్వెల్‌.. ఈసారి హైఓల్టేజ్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో..

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్‌-జెడ్‌’కు సీక్వెల్‌గా ‘మాయ-వన్‌’ రాబోతోంది

Published : 09 May 2024 18:13 IST

హైదరాబాద్‌: తెలుగు, తమిళ భాషలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అలరిస్తున్న నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan). ఆయన కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మాయావన్‌’(Maayavan). ఏడేళ్ల తర్వాత ఇటీవల ‘ప్రాజెక్ట్‌-Z’ పేరుతో తెలుగులోనూ విడుదలై అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ‘మాయా-వన్‌’ (Maaya One) పేరుతో విడుదల చేస్తున్నారు. కత్రిన్‌ డేవిసన్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీశర్మ, పృథ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా  ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. తొలి భాగంలో మాదిరిగానే పూర్తి సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ మూవీని రూపొందించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, ఫస్ట్‌ పార్ట్‌ను మించి థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ను జోడించినట్లు అర్థమవుతోంది.

‘ఒకసారి పురాణాలను దాటి వచ్చి చూస్తే, తనని తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషీ మారింది రాక్షసుడిగా మాత్రమే. అలా రాక్షసుడు పుట్టికొచ్చిన ప్రతిసారీ ఆ దేవుడు పంపేది మొండితనాన్ని ఆయుధంగా మార్చుకుని పోరాడే ఒక సామాన్యుడిని..’ అంటూ మురళీ శర్మ సంభాషణలో సాగిన టీజర్‌ ఆద్యంతం అలరిస్తోంది. ప్రాజెక్ట్‌-జెడ్‌ను రూపొందించిన సీవీ కుమార్‌ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్ట్‌-జెడ్‌మూవీ త్వరలోనే తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

‘ప్రాజెక్ట్‌-జెడ్‌ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని