Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌.. మూడు సినిమాల అప్‌డేట్స్‌ ఇవే..

విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్స్‌ వచ్చేశాయి.

Updated : 09 May 2024 13:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) అలరిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. ఫ్యాన్స్ విషెస్‌తో పాటు కొత్త సినిమాల అప్‌డేట్స్‌ రావడంతో ఈ రౌడీ హీరో పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

VD12: 

విజయ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది. దీని నుంచి పోస్టర్‌ వచ్చి నెలలు గడవడంతో అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎదురుచూశారు. వారిని ఉద్దేశిస్తూ చిత్రబృందం నోట్‌ విడుదల చేసింది. ‘రౌడీ హీరో ఫ్యాన్స్‌, తెలుగు ఆడియన్స్.. మీ సహనాన్ని అభినందిస్తున్నాం. మేము ఒక అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకురానున్నాం. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ బెస్ట్‌ అందిస్తాం. ప్రస్తుతం వైజాగ్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. టీమ్‌ అందరికీ ఇది చాలా ముఖ్యమైన షెడ్యూల్‌. త్వరలోనే సర్‌ప్రైజ్‌తో మీ ముందుకు వస్తాం’ అని పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌  (Vijay devarakonda) గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. 

VD13:

తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకొన్న రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా మూవీ యూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘కత్తినేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..’ అంటూ రక్తంతో తడిచిన చేయి ఉన్న పోస్టర్‌ను (Movie Poster) పంచుకుంది. ఈ డైలాగుతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయన్నట్లు తెలుపుతూ 5 భాషల్లో పోస్టర్‌ను విడుదల చేశారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది తెరకెక్కనుంది.

గుడ్‌న్యూస్‌ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ

VD14:

‘టాక్సీవాలా’ , ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మెప్పించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ ఓ సినిమా నిర్మిస్తోంది. VD14 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ వీరుడి విగ్రహం ఉన్న పోస్టర్‌ను పంచుకుంటూ ఈ సినిమాను వెల్లడించారు. 1854 నుంచి 1873 మధ్య సాగిన కథగా అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని