Salaar2: ‘సలార్‌’లో పాత్రపై ఊహించని అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

‘సలార్‌’లో తన పాత్రపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Updated : 08 May 2024 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’లో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధానపాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక దీని సీక్వెల్‌గా రానున్న సలార్‌2లోనూ వరదరాజ మన్నార్‌, శివమన్నార్‌ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తన పాత్ర గురించి ఊహించని అప్‌డేట్‌ ఇచ్చారు.

‘శివమన్నార్‌ పాత్ర (Shiva Mannar) ఎంతో నచ్చింది మరింత చూడాలనుకుంటున్నాం’ అంటూ ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి పృథ్వీరాజ్‌ స్పందిస్తూ.. ‘ప్రశాంత్‌ నీల్ నాకు చెప్పిన కథలన్నింటిలో.. శివ మన్నార్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రకు మరొక యూనివర్స్‌లో (Prashanth Neel Cinematic Universe) కూడా నమ్మశక్యం కానీ క్రాస్‌ ఓవర్‌ ఉంటుంది’ అని చెప్పారు. దీంతో ప్రశాంత్‌ నీల్‌ తర్వాత రానున్న సినిమాలో ఈ పాత్ర ఉంటుందని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్‌ - జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో సలార్‌ పాత్రలకు లింక్‌ ఉంటుందని ఊహిస్తున్నారు.

జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ

‘సలార్‌’ సూపర్‌ హిట్‌ సాధించడంతో దీని రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రూపొందించనున్నారు. ఎన్నో ప్రశ్నలతో మొదటి భాగాన్ని ముగించిన ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel).. రెండో పార్ట్‌లో వాటికి ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీని షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మే చివరి వారం నుంచి 10 రోజుల పాటు జరిగే షూట్‌లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌లు పాల్గొంటారని టాలీవుడ్ టాక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని