Thug Life: కమల్‌ హాసన్‌ సినిమాలో బాలీవుడ్‌ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్‌

కమల్‌ హాసన్‌ ‘థగ్‌ లైఫ్‌’లో బాలీవుడ్‌ హీరో అలీ ఫజల్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

Published : 09 May 2024 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ తారాగణంతో, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఇది రూపొందుతోంది. తాజాగా ఇందులో బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్‌ భాగమయ్యారు. సినిమాలతో పాటు ‘మీర్జాపూర్‌’ వంటి హిట్‌ సిరీస్‌లతో గుర్తింపుతెచ్చుకున్న ఈ హీరో  (Ali Fazal) ‘థగ్‌ లైఫ్‌’లో నటించడం ఆనందంగా ఉందంటూ నోట్‌ విడుదల చేశారు.

‘‘థగ్‌ లైఫ్‌’లో నటిస్తుండడం ఎంతో థ్రిల్‌గా ఉంది. ఇందులో నాది కీలకపాత్ర. ఈ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా. భారతీయ సినిమాకు చెందిన ఇద్దరు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా గౌరవంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రను ఇచ్చారు. తెరపై దానికి జీవం పోసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబుని తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు.

విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌.. మూడు సినిమాల అప్‌డేట్స్‌ ఇవే..

సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) సిద్ధమవుతోంది. ‘నాయకన్‌’ లాంటి హిట్‌ తర్వాత కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో 36 సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక. మలయాళ నటుడు జోజు జార్జ్‌తో పాటు హీరో గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్ స్వరాలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు