Prabhas: ‘కన్నప్ప’లో ప్రభాస్‌.. అప్‌డేట్‌ ఇచ్చిన మంచు విష్ణు

‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే?

Updated : 09 May 2024 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) నటించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు విష్ణు. ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెట్టారని తెలియజేస్తూ.. ఓ ఫొటో పంచుకున్నారు. అందులో ప్రభాస్‌ ముఖాన్ని రివీల్‌ చేయలేదు. కాళ్లను మాత్రమే చూపించారు. శివ భక్తుడైన నందీశ్వరుడుగా ప్రభాస్‌ కనిపించనున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకుడు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని