Kalyan Ram: ‘డెవిల్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌.. ‘పార్ట్‌ 2’ అనౌన్స్‌ చేసిన నటుడు

కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘డెవిల్‌’ (Devil). శుక్రవారం ఈ సినిమా విడుదలైంది.

Published : 29 Dec 2023 20:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) నటించిన రీసెంట్‌  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘డెవిల్‌’ (Devil). అభిషేక్ నామా దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కల్యాణ్‌రామ్‌ నటన బాగుందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో తాజాగా ‘డెవిల్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కల్యాణ్‌రామ్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీమ్‌ వర్క్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించడం సాధ్యమైందన్నారు.

అనంతరం ఆయన ‘డెవిల్‌ 2’ గురించి మాట్లాడుతూ.. ‘‘డెవిల్‌ 2’ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కారైకుడిలో ‘డెవిల్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు చిత్ర రచయిత శ్రీకాంత్‌ విస్సా ‘డెవిల్‌ 2’ ఐడియా చెప్పారు. నాకెంతో ఆసక్తిగా అనిపించింది. 2024-25లో ఈ ప్రాజెక్ట్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో 1940తోపాటు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా చూపించనున్నాం’’ అని చెప్పారు.

1940 ద‌శ‌కంలో జ‌రిగే క‌ల్పిత క‌థతో పీరియాడికల్‌ డ్రామాగా ‘డెవిల్‌’ తెరకెక్కింది. బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసే డెవిల్‌ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ నటించారు. సంయుక్త కథానాయిక. మాళవిక నాయర్‌, సీత, సత్య, ఎస్తర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్‌ నామా దర్శక - నిర్మాతగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని