Kamal haasan: ‘కమల్‌’ కొత్త కబుర్లు

కమల్‌హాసన్‌ సినీప్రియులకు కొత్త కబుర్లు వినిపించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

Updated : 26 Mar 2024 09:35 IST

మల్‌హాసన్‌ సినీప్రియులకు కొత్త కబుర్లు వినిపించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’తో పాటు ‘ఇండియన్‌ 3’ చిత్రాల్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ నిర్మాణానంతర పనుల్లో ఉందని.. అది పూర్తయిన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణానంతర పనుల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కలయికలో రూపొందుతోన్న ‘కల్కి 2898ఎ.డి’ చిత్రంలో అతిథి పాత్రలో నటించినట్లు స్పష్టత ఇచ్చారు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమాను ఎన్నికల హడావిడి పూర్తయ్యాక ప్రారంభిస్తామన్నారు. ‘‘మంచి సినిమాలు అందించడం కోసం చిత్ర బృందాలు ఎప్పుడూ తాపత్రయ పడుతుంటాయని.. ఆలస్యమైనా క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేద’’ని కమల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని