Kartikeya Gummakonda: చిరంజీవిని విమర్శిస్తే బాధగా ఉంది: కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ తన కొత్త చిత్రం ‘బెదురులంక 2012’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడారు.

Published : 18 Aug 2023 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని ఎవరైనా విమర్శిస్తే బాధేస్తుందని కార్తికేయ (Kartikeya Gummakonda) అన్నారు. నచ్చలేదు, బాగోలేదు అని సినిమాని అనడం ఓకేగానీ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసే వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందన్నారు. చిరంజీవినే కాదు అలా ఎవరినీ అనకూడదని పేర్కొన్నారు. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడకపోతే నేరమా అని ప్రశ్నించారు. ‘‘చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం. దానికి ఆయన ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని నాకు అనిపిస్తుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) సినిమా ప్రచారంలో భాగంగా కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిరంజీవిపై వస్తున్న ట్రోల్స్‌ గురించి హోస్ట్‌ అడగ్గా ఓ అభిమానిగా కార్తికేయ స్పందించారు.

‘మగధీర’ టైమ్‌ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నా: రాజమౌళి

సినిమా గురించి మాట్లాడుతూ.. తన గత చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100) ట్రైలర్‌ని, ‘బెదురులంక 2012’ ట్రైలర్‌ని ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. సన్నివేశం డిమాండ్‌ మేరకు శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్‌ చెప్పానన్నారు. ఈ సినిమాతో క్లాక్స్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన నేహాశెట్టి (Neha Shetty) నటించారు. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, ఆటో రామ్‌ప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథ ఇది. మనసుకు నచ్చినట్లుగా జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. సమాజానికి నచ్చినట్లు బతకడం సమంజసమా.. మనసుకు నచ్చినట్లు బతకడం సమంజసమా? అన్నది సినిమాలో చూడాలి’’ అని చిత్ర బృందం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు